Tuesday, April 21, 2026
Homeతాజా సమాచారందేవరకొండలో SBI-ACB బ్రాంచ్‌లో భారీ మోసం ఛేదనరూ.2.42 కోట్లు స్వాధీనం – నలుగురు నిందితుల అరెస్ట్

దేవరకొండలో SBI-ACB బ్రాంచ్‌లో భారీ మోసం ఛేదనరూ.2.42 కోట్లు స్వాధీనం – నలుగురు నిందితుల అరెస్ట్

నల్లగొండ బ్యూరో, ఏప్రిల్ 21,శుభోదయ డైనమిక్

నల్లగొండ జిల్లా పరిధిలోని దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ACB బ్రాంచ్‌లో జరిగిన భారీ ఆర్థిక మోసం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.2,42,10,000 నగదు, 6 స్మార్ట్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన నిందితులు

ఏప్రిల్ 13న బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాంట్రాక్ట్ హౌస్‌కీపింగ్ ఉద్యోగి లెండల చక్రపాణి బ్యాంక్‌లోని ఇనాక్టివ్ ఖాతాల వివరాలను దుర్వినియోగం చేసి, అక్రమంగా KYC అప్డేట్ చేసి రూ.2.65 కోట్లకు పైగా మోసపూరితంగా బదిలీ చేసినట్లు వెల్లడైంది.

మేనేజర్ సహకారంతో పన్నిన పన్నాగం

సూర్యాపేట SBI బ్రాంచ్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులు సహకారంతో ఈ మోసం పన్నినట్లు పోలీసులు తెలిపారు. MIS ద్వారా ఇనాక్టివ్ ఖాతాల వివరాలు సేకరించి, నకిలీ ఆధార్, PAN కార్డులు సృష్టించి ఖాతాలను అప్డేట్ చేశారు.

YONO యాప్ ద్వారా నగదు బదిలీలు

బ్యాంక్ ఉద్యోగుల లాగిన్ వివరాలు వినియోగించి, ఖాతాలకు కొత్త మొబైల్ నంబర్లు జోడించి YONO యాప్ ద్వారా యూజర్ ఐడీలు సృష్టించి నగదును ఇతర ఖాతాలకు మళ్లించారు.

కమిషన్ ఆశతో ఇతరుల ఖాతాల వినియోగం

రికవరీ ఏజెంట్ రాంలాల్, ఫోటోగ్రాఫర్ శివ ఇతరుల ఖాతాలను కమిషన్ ఆశ చూపించి ఉపయోగించుకున్నారు. ఈ మొత్తాన్ని ముందుగా నిర్ణయించిన వాటాల ప్రకారం పంచుకున్నారు.

అలర్ట్ మెసేజ్‌తో బయటపడిన మోసం

హైదరాబాద్‌కు చెందిన ఖాతాదారునికి అక్రమ KYC అప్డేట్‌పై అలర్ట్ మెసేజ్ రావడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

స్వాధీనం చేసిన నగదు వివరాలు

నిందితుల వద్ద: రూ.1,10,60,000

ఇతర ఖాతాల నుండి రికవరీ: రూ.1,31,50,000

మొత్తం: రూ.2,42,10,000

పోలీసుల సమర్థ దర్యాప్తు

ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments