Saturday, September 12, 2026
Homeతాజా సమాచారంప్రాణాలను పణంగా పెట్టకండి – రోడ్డు నిబంధనలు పాటించండి: టేక్మాల్ పోలీసులు

ప్రాణాలను పణంగా పెట్టకండి – రోడ్డు నిబంధనలు పాటించండి: టేక్మాల్ పోలీసులు

డైనమిక్ న్యూస్ | ఏప్రిల్ 9 | టేక్మాల్

మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని సాలోజిపల్లి గ్రామంలో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

రేడియం స్టిక్కర్లు తప్పనిసరి

రాత్రి సమయంలో ట్రాక్టర్లు స్పష్టంగా కనిపించేలా ట్రాలీల వెనుక భాగంలో నాణ్యమైన రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది ప్రమాదాలను తగ్గించడంలో కీలకమని తెలిపారు.

వాహన పత్రాలు సక్రమంగా ఉండాలి

ప్రతి వాహనానికి సంబంధించిన ఆర్‌సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు ఎప్పుడూ సక్రమంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

అధిక లోడుపై హెచ్చరిక

పరిమితికి మించి లోడుతో వాహనాలను నడపడం ప్రమాదకరమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భద్రతే ప్రాణ రక్షణ

రోడ్డు భద్రత నియమాలను తప్పకుండా పాటించడం ద్వారా ప్రమాదాలు, ప్రాణ నష్టం నివారించవచ్చని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments