Tuesday, June 2, 2026
Homeతాజా సమాచారంబూరుగడ్డ గ్రామ అభివృద్ధి కోసం వినతి– కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖాధికారికి సర్పంచ్ విజ్ఞప్తి

బూరుగడ్డ గ్రామ అభివృద్ధి కోసం వినతి– కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖాధికారికి సర్పంచ్ విజ్ఞప్తి

హుజూర్నగర్, డైనమిక్ న్యూస్, మార్చి 19

బూరుగడ్డ గ్రామ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ యరగాని రాధ నాగరాజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు.

పాఠశాల భవనం పూర్తి చేయాలి

బూరుగడ్డ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న భవనం చాలా కాలంగా అసంపూర్తిగా ఉందని, విద్యార్థుల సౌకర్యార్థం దానిని త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్ కోరారు.

ఆరోగ్య ఉపకేంద్రం అవసరం

గ్రామ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బూరుగడ్డలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మాచవరంలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలి

మాచవరం గ్రామంలో స్మశాన వాటిక లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ స్మశాన వాటిక ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని అధికారులను అభ్యర్థించారు.

గ్రామ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి – సర్పంచ్ యరగాని రాధ నాగరాజు

గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments