Tuesday, March 17, 2026
Homeతాజా సమాచారంమోతె మండలంలో గ్రామపంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్టులుచలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

మోతె మండలంలో గ్రామపంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్టులుచలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

డైనమిక్ న్యూస్, మోతె, మార్చి 17

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో మోతె మండలానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ అరెస్టులను సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెల వేతనాలు నేరుగా చెల్లిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ మార్చి 2న ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా కాకుండా గ్రామపంచాయతీ నిధుల ద్వారానే వేతనాలు చెల్లించాలని నిర్ణయించడం కార్మికులపై అన్యాయం అని విమర్శించారు.

కార్మికుల డిమాండ్లు

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో గ్రామపంచాయతీ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామపంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు నేరుగా చెల్లించే విధానం అమలు చేయాలని, సర్పంచుల వేధింపులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నవిలే నాగరాజు, ఉపాధ్యక్షుడు వట్టికూటి అవిలయ్య, ప్రధాన కార్యదర్శి గజ్జి లింగయ్య, సలహాదారులు జలగం తిరపయ్య, వీరయ్య, మహిళా ఉపాధ్యక్షురాలు కాంపాటి నాగమణి, స్కైలాబు పరుశురాములు, గురవయ్య, మంగయ్య, సైదులు తదితర గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments