Saturday, April 18, 2026
Homeతాజా సమాచారంనేరేడు చర్ల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ ఆధిక్యం ఆరుగురు వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా

నేరేడు చర్ల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ ఆధిక్యం ఆరుగురు వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 16

నేరేడు చర్ల మున్సిపాలిటీలో తాజా ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. మొత్తం ఆరు వార్డుల్లో విజయాన్ని అందుకొని మున్సిపల్ పాలనలో కీలక స్థానాన్ని సంపాదించింది. ఇందులో ఐదు వార్డులు బీఆర్‌ఎస్ పార్టీకి నేరుగా దక్కగా, మరో ఒక వార్డు బీఆర్‌ఎస్–జనసేన పొత్తు ద్వారా జనసేన అభ్యర్థి గెలుపొందడం విశేషం.సోమవారం జరిగిన మున్సిపల్  కార్యాలయంలో గెలుపొందిన ఆరుగురు వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రజలకు నిష్ఠతో సేవలు అందిస్తామని ప్రమాణం చేశారు.

గెలుపొందిన కౌన్సిలర్లు

బీఆర్‌ఎస్ పార్టీ తరఫున

1వ వార్డు నుండి గూగులోతు రవీందర్ నాయక్

3వ వార్డు నుండి దొండపాటి అప్పిరెడ్డి

7వ వార్డు నుండి వాసా జ్యోతి

10వ వార్డు నుండి ఇంజమూరి వెంకటమ్మ

11వ వార్డు నుండి మహమ్మద్ షాహిన్

అలాగే బీఆర్‌ఎస్–జనసేన పార్టీ మద్దతుతో

14వ వార్డు నుండి ఆరూరి విజయలక్ష్మి కౌన్సిలర్‌గా విజయం సాధించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : దొండ పాటి అప్పిరెడ్డి

ప్రమాణ స్వీకారం అనంతరం వార్డు కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి మాట్లాడుతూ తమ వార్డుల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కౌన్స్లర్లూ మాట్లాడుతూ, మున్సిపాలిటీలో అభివృద్ధికి సమిష్టిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నేరేడు చర్ల మున్సిపాలిటీలో ఈ విజయంతో బీఆర్‌ఎస్ పార్టీ బలమైన స్థానాన్ని ఏర్పరచుకుని, రాబోయే పాలనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments