నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 4
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సు కోసం దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి బి. శశికళ తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు – పోటీ పరీక్షల శిక్షణకు అవకాశం
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో http://tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్టడీ సర్కిల్స్‌లో ప్రవేశాలు పోటీ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారన్నారు.
ముఖ్య తేదీలు
దరఖాస్తుల చివరి తేదీ : 22-02-2026
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ : 25-02-2026 నుంచి
ప్రవేశ పరీక్ష తేదీ : 01-03-2026 (ఆదివారం)
సమయం : ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు
కేంద్రం : నాగార్జున డిగ్రీ కళాశాల, నల్లగొండ
అర్హతలు
యస్.సి, యస్.టి, బి.సి (బి.సి-ఇ), పిడబ్ల్యూడి వర్గాలకు చెందిన డిగ్రీ ఉత్తీర్ణులు, సంవత్సరానికి రూ.3 లక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన వారు అర్హులని తెలిపారు.
అవసరమైన ధృవపత్రాలు
కులం సర్టిఫికెట్
ఆదాయం సర్టిఫికెట్ (01-04-2025 తరువాత తీసినది)
డిగ్రీ సర్టిఫికెట్
పదో తరగతి సర్టిఫికెట్ (వయసు నిర్ధారణకు)
ఆధార్ కార్డు
పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం
అంగవైకల్యం సర్టిఫికెట్ (వర్తిస్తే)
గమనిక
గతంలో స్టడీ సర్కిల్స్‌లో 5 నెలల కోచింగ్ తీసుకున్న వారు లేదా సివిల్ సర్వీసెస్ స్టేట్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన వారు అర్హులు కాదని తెలిపారు.
సంప్రదించండి
📞 9396621492
