మోతే ,డైనమిక్ న్యూస్ , ఫిబ్రవరి 4
సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని మామిళ్లగూడెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర విద్యానిలయం తన 33వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దల సమక్షంలో వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.
తల్లిదండ్రుల సహకారమే విజయానికి మూలం : ఎండి జానిమియా
ఈ సందర్భంగా విద్యాసంస్థ అధిపతి ఎండి జానిమియా మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా తమ విద్యాసంస్థను విజయవంతంగా నడుపుతున్నామంటే అందుకు ప్రధాన కారణం విద్యార్థుల తల్లిదండ్రుల సహకారమేనని అన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య
ఇన్ని సంవత్సరాల కాలంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించామని చెప్పారు.
నవోదయ, సైనిక్ పాఠశాలలకు కోచింగ్
గురుకుల, నవోదయ, సైనిక్ పాఠశాలలకు విద్యార్థులను సిద్ధం చేసి వారికి సీట్లు సాధించేలా కోచింగ్ అందించామని, పలువురు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేసే స్థాయికి చేరుకున్నారని తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
ఈ సందర్భంగా ఈ విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా తెలుగు ఉపాధ్యాయుడు డర్రా లక్ష్మయ్యను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.
వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మీరంబి, మీరంబి అకాడమీ డీన్ అజారుద్దీన్, ప్రిన్సిపాల్ సఫియా, డైరెక్టర్లు సయ్యద్ మియా, ఆజాద్, సబీహా అంజు, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, డీ రాములు, పుల్లయ్య, సర్పంచులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
