డైనమిక్ న్యూస్, జనవరి 31, సూర్యాపేట
సూర్యాపేట పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెంకటి శేఖర్ రెడ్డి తనను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. శుక్రవారం నాడు ఆయన అధికారికంగా తన నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా వెంకటి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తాను కౌన్సిలర్‌గా ఎన్నికైతే వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తన వంతు సహాయం అందిస్తానని స్పష్టం చేశారు.అలాగే 10వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు బోళ్ల శేఖర్ రెడ్డి, పందిరి మల్లేష్ గౌడ్, కనుకు వెంకన్న, వెంకటి వెంకటరెడ్డి, మందాడి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొని వెంకటి శేఖర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.
