Monday, March 2, 2026
Homeతాజా సమాచారంప్రజావాణి పిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలి అన్ని శాఖలు డీడీఓ బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలి–...

ప్రజావాణి పిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలి అన్ని శాఖలు డీడీఓ బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలి– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట బ్యూరో, జనవరి 19, డైనమిక్ న్యూస్

ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వేగంగా పరిష్కరించాలని సూచించారు.

సమీకృత కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి సంబంధించి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.

పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక పర్యవేక్షణ

కొన్ని శాఖల్లో ప్రజావాణి దరఖాస్తులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. వాటిని తక్షణమే తగ్గించుకోవాలని, దరఖాస్తుల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

డీడీఓ బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలి

జిల్లాలోని ప్రతి శాఖ తమ డీడీఓ బ్యాంక్ అకౌంట్ వివరాలను జిల్లా అకౌంట్ వెరిఫికేషన్ కమిటీకి సంబంధిత ప్రొఫార్మాలో పూర్తి చేసి కమిటీ ముందు హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.

43 ప్రజావాణి దరఖాస్తులు స్వీకరణ

ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో

భూ సమస్యలకు సంబంధించి – 21 దరఖాస్తులు,

డీడబ్ల్యూఓ – 5,

డీపీఓ – 4,

డీఎం అండ్ హెచ్‌ఓ – 2,

ఇతర శాఖలకు చెందినవి – 11

మొత్తం 43 దరఖాస్తులు స్వీకరించగా, వాటిని పరిష్కారార్థం సంబంధిత శాఖలకు పంపించినట్లు కలెక్టర్ తెలిపారు.

అధికారులు, సిబ్బంది హాజరు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డిప్యూటీ సీఈవో శిరీష, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీఈఓ అశోక్, డీఎం అండ్ హెచ్‌ఓ పి. వెంకటరమణ, డీఎస్ఓ మోహన్ బాబు, సీపీఓ కిషన్ నాయక్, సంక్షేమ అధికారులు దయానంద్ రాణి, శంకర్, నరసింహారావు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి తదితర జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments