Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారంసోమవారం గ్రామ బీజేపీ శాఖ అధ్యక్షుడు కారంగుల శ్రీనివాస్ గౌడ్‌ సహా పలువురు కాంగ్రెస్‌లో చేరిక

సోమవారం గ్రామ బీజేపీ శాఖ అధ్యక్షుడు కారంగుల శ్రీనివాస్ గౌడ్‌ సహా పలువురు కాంగ్రెస్‌లో చేరిక

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11

సోమవారం గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కారంగుల శ్రీనివాస్ గౌడ్, నంది పాటి కర్ణాకర్‌తో పాటు 20 మంది బీజేపీ కార్యకర్తలు, బీజేపీ మహిళా కమిటీ మెంబర్లు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట రెడ్డి వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

అభివృద్ధి – సంక్షేమ పథకాలకే ఆకర్షణ

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి తమ గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని భావించి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు నాయకులు పేర్కొన్నారు.

కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం

చేరిక కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్న వెంకట రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా రామారావు సోమవారం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ రహీముద్దీన్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ రాచకొండ అజయ్ మండల యూత్ అధ్యక్షుడు షేక్ ఇస్తియాక్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్, పాండు, పర్వతం వెంకన్న, ప్రవీణ్, అజ్జిద్, మామడి వెంకటేశ్వర్లు, వినోద్, శ్రీనివాస్ తో పాటు ఎంతోమంది కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments