Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారంఎన్నికల బందోబస్తు విధుల్లో అప్రమత్తత, క్రమశిక్షణ తప్పనిసరి జిల్లా ఎస్పీ నరసింహ  ఆధ్వర్యంలో సిబ్బందికి మార్గదర్శనం

ఎన్నికల బందోబస్తు విధుల్లో అప్రమత్తత, క్రమశిక్షణ తప్పనిసరి జిల్లా ఎస్పీ నరసింహ  ఆధ్వర్యంలో సిబ్బందికి మార్గదర్శనం

డైనమిక్ న్యూస్, సూర్యాపేట బ్యూరో, డిసెంబర్ 10

డిసెంబర్ 11న జిల్లాలో జరగనున్న మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల బందోబస్తు విధుల్లో నియమితులైన పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తత, క్రమశిక్షణతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశించారు.

సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్

సూర్యాపేట మండల పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న పోలీసు సిబ్బందికి పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్‌లో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, విధుల నిర్వహణపై కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసు శాఖ పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం అనుమతించబడదు

విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా పూర్తి అంకితభావంతో పనిచేయాలని సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. కేటాయించిన విధులను, విధి ప్రాంతాలను పనులు పూర్తయ్యే వరకు వదలరాదని సూచించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద కఠిన నిబంధనలు

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమబద్ధంగా నియంత్రించాలన్నారు.అనుమతి లేని వ్యక్తులను కేంద్రాల పరిసరాల్లోకి అనుమతించరాదని,
100 మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు.

సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై నిఘా

ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ఈ విషయంలో సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు.

ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా పాటించాలి

ప్రతి అధికారి, సిబ్బంది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో తలెత్తే సమస్యలు లేదా ఇబ్బందులను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

సమన్వయంతోనే విజయవంతమైన ఎన్నికలు

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలంటే సమన్వయం అత్యంత అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. ఎన్నికల భద్రత ఒక సమష్టి బాధ్యత అని, దీనిని విజయవంతం చేయడంలో పోలీసు సిబ్బంది పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments