Monday, March 2, 2026
Homeతాజా సమాచారంనేడు నేరేడుచర్లలో గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యుల మహిళా రిజర్వేషన్ డ్రా

నేడు నేరేడుచర్లలో గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యుల మహిళా రిజర్వేషన్ డ్రా

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 23

నేరేడుచర్ల మండల పరిషత్తు కార్యాలయం సమావేశ మందిరంలో నేడు (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు గ్రామ పంచాయతీల వార్డ్ సభ్యుల 50 శాతం మహిళా రిజర్వేషన్ కోసం డ్రా నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు.

అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎంపీడీవో

మహిళా రిజర్వేషన్ కేటాయింపుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు ఎంపీడీవో వెల్లడించారు. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డ్‌ ల రిజర్వేషన్‌ను లాటరీ పద్ధతిలో చేపడతామని తెలిపారు.

రాజకీయ పార్టీ ప్రతినిధులకు హాజరు తప్పనిసరి

డ్రా కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, వార్డ్ సభ్యులు మరియు సంబంధిత బాధ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో శ్యామ్ సుందర్ రెడ్డి కోరారు. రిజర్వేషన్ డ్రా పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments