జగ్గయ్యపేట, డైనమిక్ ,నవంబర్ 17
ఆర్‌ఎంకే టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. మురళీకృష్ణ జన్మదినం మరియు ఫౌండేషన్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతారాంపురంలోని భవితా సెంటర్లో దివ్యాంగ విద్యార్థులకు పండ్లు, బిస్కెట్ల ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమాన్ని చారుగుండ్ల లక్ష్మీనారాయణ (కొండ), పోలంపల్లి రాధమ్మ, జోనే బోయిన శ్రీనివాసరావు, గోనెల పద్మావతి, కొంకిమళ్ళ నాగరాజు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. దివ్యాంగ పిల్లలకు సహాయం అందించడం పట్ల నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
