Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారంబ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం– జిల్లా మేనేజర్ ఎ. అనిత

బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం– జిల్లా మేనేజర్ ఎ. అనిత

నల్లగొండ బ్యూరో, నవంబర్ 13, డైనమిక్

మహిళల ఆత్మనిర్భరతకు తోడ్పడేందుకు ఉద్దేశించిన బ్యూటీషియన్ కోర్స్ ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 24న ప్రారంభమవుతాయని దుర్గాభాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) జిల్లా మేనేజర్ ఎ. అనిత ఒక ప్రకటనలో తెలిపారు.

8వ తరగతి విద్యార్హతతో 18–35 ఏళ్ల మహిళలకు అవకాశం

ఈ కోర్సులో 8వ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు లేదా విఫలమైనా సరే, 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులని ఆమె చెప్పారు. మొత్తం 25 సీట్లతో, 45 రోజులపాటు శిక్షణ కొనసాగుతుందని వివరించారు.

అన్ని వర్గాల మహిళలకు ఆహ్వానం

ఆసక్తి గల జనరల్ మహిళలు, ఒంటరి మహిళలు, పాఠశాల మద్యలో చదువు ఆపిన మహిళలు, మరియు అంగవైకల్యం ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ యోగ్యతాపత్రం జీరోక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జీరోక్స్ కాపీ, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలుతో కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్లు

మరిన్ని వివరాల కోసం దుర్గాభాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం), నల్లగొండ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు.ఫోన్ నంబర్లు: 76600 22517, 08682-244416, 99633 79302.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments