Monday, March 2, 2026
Homeఆంధ్ర ప్రదేశ్కారంపూడి మండల టీడీపీ అధ్యక్షుడిగా గోళ్ల సురేష్ యాదవ్ ప్రమాణ స్వీకారంమాచర్లలో బుధవారం ఘనంగా కార్యక్రమం

కారంపూడి మండల టీడీపీ అధ్యక్షుడిగా గోళ్ల సురేష్ యాదవ్ ప్రమాణ స్వీకారంమాచర్లలో బుధవారం ఘనంగా కార్యక్రమం

కారం పూడి,నవంబర్ 11 (డైనమిక్ న్యూస్):

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆశీస్సులతో కారంపూడి మండల టీడీపీ అధ్యక్షుడిగా గోళ్ల సురేష్ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం మాచర్లలోని మనుకొండకళ్యాణమండపంలో నిర్వహించబడుతుంది. అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యానికి పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు గోళ్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ —

మండలంలోని అన్ని గ్రామాల టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరుకానున్నారు. మండల, క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా ఈ వేడుకలో భాగంగా నిర్వహించనున్నట్టు సురేష్ యాదవ్ తెలిపారు.

విజయవంతం చేయాలని పిలుపు

నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments