Monday, March 2, 2026
Homeఆంధ్ర ప్రదేశ్కుల పెద్దల ఆధ్వర్యంలో సమావేశం కమ్మ సంఘం అధ్యక్షుడిగా చప్పిడి రాము ఏకగ్రీవ ఎన్నిక

కుల పెద్దల ఆధ్వర్యంలో సమావేశం కమ్మ సంఘం అధ్యక్షుడిగా చప్పిడి రాము ఏకగ్రీవ ఎన్నిక

కారంపూడి, నవంబర్ 7, డైనమిక్

కారంపూడి మండలం కమ్మ సంఘం అధ్యక్షుడిగా చప్పిడి రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో కమ్మ కుల సంఘ పెద్దల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడి నియామకంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

అధ్యక్ష పదవికి రాము పేరును ప్రతిపాదన

అధ్యక్ష పదవికి చప్పిడి రాము పేరును టిడిపి రాష్ట్ర కార్యదర్శి పంగులూరి అంజయ్య ప్రతిపాదించగా, బోల్నీడి శ్రీనివాసరావు, లాయర్ కొంగర హరి సత్యనారాయణ, మద్దిరాల ఉమామహేశ్వరరావు, గుండాల వెంకటేశ్వర్లు, నాయుడు లక్ష్మీనారాయణ, చిరుమామిళ్ల శ్రీనివాసరావు తదితరులు మద్దతు తెలపడంతో రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇతర కీలక బాధ్యతలు

ఉపాధ్యక్షుడిగా గుట్లపల్లి వెంకటప్పయ్య, కార్యదర్శిగా ఉన్నం మల్లయ్య, కోశాధికారిగా కొండపల్లి అప్పారావు, కార్య నిర్వాహణాధికారిగా గర్నేడి రోశయ్యలను ఎంపిక చేశారు. కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సేవా కార్యక్రమాలకు కట్టుబడి ఉంటానన్న రాము

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చప్పిడి రాము మాట్లాడుతూ “మండలంలోని కమ్మ సేవా సమితి తరపున పేద విద్యార్థులకు అండగా ఉంటాం. అమ్మజనుల అభ్యున్నతికి, యువత అభివృద్ధికి కృషి చేస్తాం,” అని తెలిపారు.

కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో ఉన్నం లక్ష్మీనారాయణ, మునుగోటి సత్యం, దొడ్డ వెంకటనారాయణ, కోదాటి ప్రభాకర్, కందిమళ్ల లక్ష్మయ్య, పెమ్మసాని ఏడుకొండలు, సాంబశివరావు, యరపతినేని రామయ్య, నర్రా శీను, వసంత రామారావు, మాదల సత్యనారాయణ, పంగులూరి లక్ష్మయ్య, ఉన్నం ముక్కంటి మరియు కుల సంఘ పెద్దలు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments