Monday, March 2, 2026
Homeతాజా సమాచారంమిర్యాలగూడలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42%...

మిర్యాలగూడలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్

మాడుగుల పల్లి (మిర్యాలగూడ), నవంబర్ 6:

మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద గురువారం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు మౌన దీక్ష నిర్వహించారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఆందోళనను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినట్లు బీసీ జేఏసీ కన్వీనర్ గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా మౌన దీక్ష

ఈ దీక్షలో ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ జాడి రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు దుర్గయ్య, బీసీ సంఘం నాయకులు ఎస్పీ నాయుడు, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్ తదితరులు పాల్గొని బీసీల రిజర్వేషన్ సాధన కోసం తమ మద్దతు తెలిపారు.

బీసీల హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగుతుందంటూ నాయకులు స్పష్టం

బీసీలకు న్యాయమైన వాటా దక్కే వరకు పోరాటం కొనసాగుతుందని, విద్యా మరియు రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలంటూ నాయకులు ప్రభుత్వాలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments