Monday, March 2, 2026
Homeతాజా సమాచారంపెద్దవూర పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర...

పెద్దవూర పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యటన

నల్లగొండ బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 31

మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది విధి నిర్వహణ, స్టేషన్ పరిమితిలోని శాంతిభద్రతల పరిస్థితులు, భౌగోళిక పరిసరాలపై ఎస్పీ సవివరంగా ఆరా తీశారు.

రికార్డుల పరిశీలన – సిబ్బందికి మార్గదర్శకాలు

ఎస్పీ స్టేషన్‌లోని రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్ రూమ్, లాక్‌అప్, యస్‌హెచ్‌ఓ గది వంటి విభాగాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డులు, కేసు దర్యాప్తు వివరాలను పరిశీలిస్తూ, “ఫిర్యాదులపై ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడడం ప్రతి అధికారికీ ప్రధాన బాధ్యత” అని సిబ్బందికి సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి – ఎస్పీ పవార్

పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు కృషి చేయాలని, బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందించాలి అని ఆదేశించారు.

నేర నియంత్రణపై కఠిన చర్యలు

గ్రామ పోలీసు అధికారులు రోజువారీగా గ్రామాలను సందర్శించి నేర నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రౌడీ షీటర్లపై కఠిన నిఘా, ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీసీటీవీల ఏర్పాటు – సైబర్ అవగాహనపై దృష్టి

దొంగతనాల నివారణ కోసం స్టేషన్ పరిధిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, అలాగే సైబర్ క్రైమ్, డయల్ 100 సేవల వినియోగంపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలి అని ఎస్పీ సూచించారు.

అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం

గంజాయి, పిడియస్ రైస్ అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై నిఘా ఉంచి, సరఫరా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఎస్పీ పవార్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, సీఐ శ్రీను నాయక్, ఎస్‌ఐ ప్రసాద్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments