Wednesday, July 29, 2026
Homeతాజా సమాచారంచిల్లేపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌కు కన్నం.. ఆయిల్, కోర్ చోరీ గాంధీనగర్ సిటీ సెంటర్ స్కూల్ సమీపంలో ఘటన.....

చిల్లేపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌కు కన్నం.. ఆయిల్, కోర్ చోరీ గాంధీనగర్ సిటీ సెంటర్ స్కూల్ సమీపంలో ఘటన.. రైతుల్లో ఆందోళన ఇదే నెలలో జనలదిన్నె గ్రామంలోనూ ట్రాన్స్‌ఫార్మర్ చోరీ.. నేరేడుచర్ల మండలంలో పెరుగుతున్న వరుస ఘటనలు

నేరేడుచర్ల, జూలై 18,శుభోదయ డైనమిక్ వార్త

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ సిటీ సెంటర్ స్కూల్ సమీపంలో ఉన్న 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు లక్ష్యంగా చేసుకుని భారీ చోరీకి పాల్పడ్డారు. రాత్రి వేళ ట్రాన్స్‌ఫార్మర్‌లోని ఆయిల్‌తో పాటు లోపల ఉన్న విలువైన కోర్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో పరిసర ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఉదయం పొలాలకు వెళ్లిన రైతులకు షాక్

శనివారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు చేరుకుని చూడగా, ట్రాన్స్‌ఫార్మర్ డబ్బా మాత్రమే ఉండి, అందులోని ఆయిల్, కోర్ పూర్తిగా చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇదే నెలలో జనలదిన్నెలోనూ ఇదే తరహా ఘటన

ఇదే నెలలో కొద్ది రోజుల క్రితం నేరేడుచర్ల మండలంలోని జనలదిన్నె గ్రామంలో కూడా ట్రాన్స్‌ఫార్మర్‌లోని మెటీరియల్‌ను దుండగులు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. వరుసగా ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న చోరీలు రైతుల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. ఈ ఘటనల వెనుక ఒకే ముఠా ఉండే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పంటలకు విద్యుత్ సరఫరాపై ప్రభావం

ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనంతో వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో సాగునీటి కోసం విద్యుత్‌పై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో వెంటనే కొత్తది ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.

దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలి

నేరేడుచర్ల మండలంలో ట్రాన్స్‌ఫార్మర్లలోని ఆయిల్, కోర్, ఇతర విలువైన మెటీరియల్‌ను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగలను త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులకు సమాచారం అందించిన రైతులు

ఈ ఘటనను గుర్తించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించిన వారిలో వెంకన్న, కంపాటి వెంకన్న, భూపాల్ రెడ్డి, సైదులు, మట్టా రెడ్డి తదితర రైతులు ఉన్నారు. ఘటనపై విద్యుత్ శాఖ, పోలీసులు విచారణ చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments