డైనమిక్, ఏపి, అక్టోబర్ 19
తిరుమల: శ్రీవారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. భక్తులు 27 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 82,136 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాగా, శ్రీవారి హుండీ ద్వారా రూ.3.49 కోట్లు ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.భక్తుల రద్దీ నేపథ్యంలో టిటిడి అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, సజావుగా దర్శనం కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు.
