డైనమిక్ డెస్క్,హైదరాబాద్, నవంబర్ 5
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా బుదవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లోని వారి ఛాంబర్‌లో మంత్రి వాకాటి శ్రీహరి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయనను అభినందించారు. తరువాత తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కూడా సుదర్శన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ప్రధాన సలహాదారులుగా బాధ్యతలు చేపట్టిన సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతం కానున్నాయని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆకాంక్షించారు

