నల్గొండ బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 29
సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని, దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో “మై భారత్” మరియు “ఎన్‌ఎస్ఎస్” సహకారంతో సర్దార్150 యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు కేసరి దేవ్ సిన్హ జ్వాల ప్రకటించారు.
జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమితులైన కేసరి దేవ్ సిన్హ జ్వాల బుధవారం నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశాన్ని ఏకీకృతం చేయడంలో ప్రదర్శించిన నాయకత్వం యువతకు స్ఫూర్తిదాయకం. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో యువతే ప్రధాన శక్తి” అని అన్నారు.
అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు కార్యక్రమాలు
సర్దార్150 యూనిటీ మార్చ్‌లో భాగంగా అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు జిల్లావారీగా కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు చెప్పారు.ప్రతి జిల్లాలో మూడు రోజుల పాదయాత్రను నిర్వహించాలని సూచించారు.ప్రతి పాదయాత్ర 8–10 కిలోమీటర్ల మేర సాగి, కనీసం 500 మంది యువత, విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయిలో కోర్ కమిటీలు ఏర్పాటు
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కోర్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కమిటీల్లో విశ్రాంత ఐఏఎస్ అధికారులు, జిల్లా యువజన సేవల అధికారి, ఇతర విభాగాధికారులు, ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారని వివరించారు.ప్రతివారం జాతీయ స్థాయి కోర్ కమిటీ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వైవిధ్యమైన కార్యక్రమాలు యూనిటీ మార్చ్‌లో భాగం
సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవిత విశేషాలను ప్రజలకు, యువతకు పరిచయం చేసే లక్ష్యంతో పలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు
వైద్య శిబిరాలు
యోగా క్యాంపులు,ఎగ్జిబిషన్లు, వర్క్‌షాప్‌లు,విద్యార్థుల డిబేట్, వ్యాసరచన పోటీలు,వీధి నాటకాలు, ప్రచారాలు,స్వచ్ఛత కార్యక్రమాలు,ఉన్నాయని వివరించారు
నల్గొండ, సూర్యాపేటల్లో నవంబర్ 12, 13న పాదయాత్ర
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నవంబర్ 12, 13 తేదీల్లో పాదయాత్రలు నిర్వహించ నున్నట్లు వెల్లడించారు.దీనికి సంబంధించి తగిన రూట్ మ్యాప్‌లు సిద్ధం చేయాలని సూచించారు.“కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి” అని ఆర్డీవో వై. అశోక్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపీ కేసరి దేవ్ సిన్హ జ్వాల సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సర్దార్150 యూనిటీ మార్చ్ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
గోడపత్రిక ఆవిష్కరణ
కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎం.డి. అక్బర్ అలీ, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, మెప్మా పీడీ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, “మై భారత్” ప్రతినిధి కృష్ణ, సామాజిక కార్యకర్త సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్దార్150 యూనిటీ మార్చ్ పై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు.


