Monday, March 2, 2026
Homeతాజా సమాచారంప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం ఎన్నికల కారణంగా నిలిపివేత

ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం ఎన్నికల కారణంగా నిలిపివేత

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,ఫిబ్రవరి 22

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు జిల్లా పరిపాలన వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఫిబ్రవరి 23 నుంచి యధాతధం

ఈ నెల 23వ తేదీ నుంచి సూర్యాపేటలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం యధాతధంగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి

ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత శాఖాధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments