కాకినాడ, అక్టోబర్ 31 , డైనమిక్ న్యూస్
భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నేడు జాతీయ ఐక్యత దినోత్సవాన్ని (National Unity Day) కాకినాడలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో “యూనిటీ రన్” కార్యక్రమం నిర్వహించబడింది. నాగమల్లి తొటా జంక్షన్ నుండి బాణుగుడి జంక్షన్ వరకు సాగిన ఈ రన్‌లో ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా పాల్గొని ప్రజలలో ఐక్యత, ఏకత భావాన్ని ప్రదర్శించారు.తరువాత జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రమాణ స్వీకారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పటేల్, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ శ్రీహరి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


