డైనమిక్ న్యూస్, మాసాయిపేట / జనవరి 25
ర్యాలీతో ప్రజల్లో అవగాహన
మాసాయిపేట మండల కేంద్రంలో జాతీయ 16వ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ జ్ఞానజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాడవాడలా నినాదాలు
మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి “ఓటు మన హక్కు – ప్రజాస్వామ్యానికి పునాది” అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటు హక్కుపై ప్రతిజ్ఞ
ర్యాలీ అనంతరం తాసిల్దార్ జ్ఞానజ్యోతి ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రతిజ్ఞ చేయించారు.
వృద్ధ ఓటర్లకు సన్మానం
ప్రజాస్వామ్య వ్యవస్థకు విశేష సేవలందించిన వృద్ధ ఓటర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో గిర్దవారి హరీష్, మాసాయిపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బొమ్మారం సర్పంచ్ రమేష్, చెట్ల తిమ్మాయపల్లి సర్పంచ్ అంశి మనోహర్, అచ్చంపేట, హకింపేట, పోతనపల్లి సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ఉదండపురం నరసింహులు, స్థానిక నాయకులు, సోషల్ కార్యకర్తలు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
