హుజూర్ నగర్, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
హుజూర్ నగర్ పట్టణంలో రవాణా, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రెటరీ ఎం.డి. అజీజ్ పాషా, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకురాలు చావా కిరణ్మయి పాల్గొన్నారు.
2013లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషితో ప్రారంభమైన ప్రాజెక్టు
నాయకులు మాట్లాడుతూ—
హుజూర్ నగర్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందు తుండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయని ముందుగానే అంచనా వేసిన అప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2013లో రూ. 25 కోట్ల బడ్జెట్ మంజూరు చేయించి ఔటర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించారని వారు గుర్తుచేశారు.
ఆ సమయంలో 60% పనులు పూర్తయ్యాయని, అయితే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆగిపోయి ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వేగవంతమైన పురోగతి
2023లో కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టిన వెంటనే, మంత్రి ఉత్తమ్ రింగ్ రోడ్డు పనులపై ప్రత్యేక సమీక్ష చేసి ప్రాజెక్టును పునఃప్రారంభించి నట్లు నాయకులు తెలిపారు.ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగు పర్చాలన్న సంకల్పంతో అదనంగా రూ.5 కోట్లు మంజూరు చేసి, అధికారులకు, కాంట్రాక్టర్లకు పనులను వెంటనే పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారని వివరించారు.ప్రస్తుతం 95% పనులు పూర్తయ్యాయని, కేవలం కొన్ని జంక్షన్ రోడ్ల పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
త్వరలో ప్రారంభోత్సవం – ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయ్యాక హుజూర్ నగర్ పరిసర ప్రాంతాల ఫ్యాక్టరీల భారీ వాహనాలు, కోదాడ–మిర్యాలగూడ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం ఈ రింగ్ రోడ్డు ద్వారా మళ్లించ బడుతుండడంతో పట్టణ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ ప్రాజెక్టు “రింగ్ రోడ్డు సృష్టికర్త – అభివృద్ధి ప్రదాత” గా ప్రసంశలు పొందిన మంత్రి ఉత్తమ్ తోనే సాధ్యమైందని పేర్కొన్నారు.త్వరలోనే మంత్రి ఉత్తమ్ రింగ్ రోడ్డు పనులను అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
చావా కిరణ్మయి, జక్కుల మల్లయ్య, ఎంఏ అబ్దుల్ మజీద్, జక్కుల శోభయ్య, గంజి శివ, బొడ్డు గోవిందరావు, ఎస్.కె. మన్సూర్ అలీ, పోతుల జ్ఞానయ్య, చావా సహదేవరావు, కోల మట్టయ్య, ముషంసత్యనారాయణ, బెల్లంకొండ వెంకట్ నారాయణ, పి. రామ్మూర్తి, రాయల వెంకటేశ్వర్లు, రెడ్డి జాల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
