పెనుకొండ, డైనమిక్ న్యూస్ నవంబర్ 24
పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత సోమవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమై వివిధ రైతు సమస్యలపై సమీక్ష జరిపిన ఆమె, అనంతరం ప్రజల వినతులను స్వీకరించారు.
అన్నదాత సుఖీభవ పథకంపై సమీక్ష
ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ గారు అన్నదాత సుఖీభవ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం రైతుల ఖాతాల్లో సబ్సిడీ రాకపోవడానికి కారణాలుగా ఈ–కెవైసీ పూర్తి కాకపోవడం,బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ లోపం,NPCI లింకింగ్ సమస్యలు,ఎక్వీటీ సమయంలో పొలం వివరాల మార్పులు,ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు ఉండటం వంటివి ఉన్నట్లు అధికారులు వివరించారు.రైతులు తమ సమస్యలను సమీప రైతు సేవా కేంద్రాలకు తెలియజేయాలని మంత్రి సూచించారు. పథకం గురించి ఇంటింటా ప్రచారం చేసి, రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ AD లు కృష్ణ మీనన్, కృష్ణయ్య, ఐదు మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
కూటమి నాయకులు – ప్రజల వినతుల స్వీకరణ
తరువాత జరిగిన కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. వివిధ ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను అందజేశారు. సమస్యలను ఓపిగ్గా విన్న మంత్రి సవిత, ప్రతి ఫిర్యాదును పరిశీపించి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
