Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంజూబ్లీహిల్స్ నియోజకవర్గం — ఉపఎన్నికల సందడి బోరబండలో బీఆర్ఎస్ ముమ్మర ప్రచారం

జూబ్లీహిల్స్ నియోజకవర్గం — ఉపఎన్నికల సందడి బోరబండలో బీఆర్ఎస్ ముమ్మర ప్రచారం

మాగంటి సునీత-గోపినాథ్ విజయం కోసం శ్రేణుల కసరత్తు

హైదరాబాద్‌, నవంబర్‌ 5, డైనమిక్ డెస్క్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత-గోపినాథ్ విజయానికి పార్టీ శ్రేణులు కృషి ముమ్మరం చేశాయి. బోరబండ డివిజన్‌లోని 342, 343 బూత్‌ల పరిధిలో ఈ రోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

కోటిరెడ్డి నేతృత్వంలో ప్రచార జోరు

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు (MLC) యం.సి. కోటిరెడ్డి పాల్గొని ఓటర్లను కలుసుకున్నారు. ఆయనతో పాటు గోపినాథ్ కుమార్తెలు, స్థానిక బూత్ ఇన్‌చార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల మనోభావాలు బీఆర్ఎస్ పక్షాన: కోటిరెడ్డి

“రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ప్రజల మదిలో నిలిచిపోయింది. మాగంటి సునీత-గోపినాథ్ గెలుపుతో ఆ అభివృద్ధి యాత్ర కొనసాగుతుంది,” అని కోటిరెడ్డి వ్యాఖ్యానించారు.పార్టీ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి, బీఆర్ఎస్ విజయం సాధించేందుకు అందరూ కట్టుబడి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments