డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, జనవరి 31
మున్సిపల్ ఎన్నికలను అభివృద్ధి దిశగా మలిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర నీటిపారుదల, సివిల్ సప్లయిస్ శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నేరేడు చర్ల మున్సిపల్ పరిధిలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాంగ్రెస్ గెలిస్తే క్రీడా వసతులకు ప్రాధాన్యం
నేరేడు చర్ల మున్సిపల్ లోని 15 వార్డులలో 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తే, పట్టణంలో ఆధునిక ప్లే గ్రౌండ్, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని చెప్పారు. మున్సిపాలిటీలకు నిధులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.
కార్యకర్తలే పార్టీ బలం
కార్యకర్తల కృషి వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి వార్డులో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి మండల పట్టణ అధ్యక్షులు చిన్న వెంకట్ రెడ్డి, సందీప్ రెడ్డి ఆధ్వర్యం వహించగా, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

