Thursday, January 15, 2026
Homeతెలంగాణమూడు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆనందం – సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనురుధ్ రెడ్డి...

మూడు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆనందం – సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనురుధ్ రెడ్డి కి తల్లిదండ్రుల కృతజ్ఞతలు

డైనమిక్,జడ్చెర్ల, అక్టోబర్ 17

గత మూడు దశాబ్దాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హతకు అడ్డుగా నిలిచిన “మూడు పిల్లల నిబంధన”ను ఎత్తివేయాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహం వ్యక్తమవుతోంది.

శుక్రవారం జడ్చెర్ల నియోజకవర్గంలోని క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఈ నిర్ణయానికి సంకేతంగా ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనురుధ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

తల్లిదండ్రులు మాట్లాడుతూ —


“గత 30 ఏళ్లుగా మాకు రాజకీయంగా పాల్గొనే అవకాశాన్ని ఈ నిబంధనే దూరం చేసింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మాకు కొత్త జీవం ఇచ్చింది. స్థానిక పాలనలో భాగస్వామ్యం అవ్వడానికి మార్గం సుగమమైంది” అని పేర్కొన్నారు.ముగ్గురు  పిల్లల నిబంధనతో వందలాది కుటుంబాలు అన్యాయానికి గురయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి  దూరదృష్టితో ఆ అన్యాయం తొలగింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కు కల్పించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యాంప్ ఆఫీస్ పరిసరాలు “రేవంత్ జిందాబాద్”, “ప్రజా ప్రభుత్వం జయహో” నినాదాలతో మార్మోగాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments