డైనమిక్, నల్లగొండ బ్యూరో
నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి మండలం రామలింగాలగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ —
రైతుల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పంటకు సరైన మద్దతు ధర లభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆయన సూచించారు.ప్రారంభ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
