నల్లగొండ బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 30
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నల్లగొండ పట్టణంలో గురువారం సైకిల్ ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.పట్టణంలోని యన్.జి కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ రామగిరి మీదుగా క్లాక్‌టవర్ వరకు కొనసాగింది. పోలీసు సిబ్బంది, విద్యార్థులు, పట్టణ యువకులు ఉత్సాహంగా పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించారు.
శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుందాం
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, “దేశం కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయాలు. వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ‘పోలీస్ ప్లాగ్ డే’ నిర్వహిస్తాము. అదే ఉత్సాహంతో అమరవీరుల వారోత్సవాలను కూడా జరుపుకుంటున్నాం,” అని అన్నారు.జిల్లా పోలీసులు ప్రజా రక్షణే తమ ప్రధాన ధ్యేయమని, రాత్రింబవళ్లు శాంతి భద్రతల పరిరక్షణలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని తెలిపారు. అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.



అధికారులు, సిబ్బంది, విద్యార్థుల ఉత్సాహం
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, మహాలక్ష్మయ్య, శ్రీను నాయక్, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, హరిబాబు, ఎస్సైలు సైదులు, శంకర్, గోపాల్ రావు, వీరబాబు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
