Monday, April 27, 2026
Homeతాజా సమాచారంసూర్యాపేటలో ఘనంగా 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం పరేడ్‌కు గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ...

సూర్యాపేటలో ఘనంగా 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం పరేడ్‌కు గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ నరసింహ హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి – జిల్లా ఎస్పీ ప్రశంస

సూర్యాపేట బ్యూరో, డిసెంబర్ 6 , డైనమిక్ న్యూస్

భద్రతా వ్యవస్థలో హోంగార్డు సేవలు వెలకట్టలేనివని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం పరిధిలో హోంగార్డు అధికారులు ఘనంగా పరేడ్ నిర్వహించారు.జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించి పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా హోంగార్డు అధికారులకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.

పోలీసులకు దీటుగా హోంగార్డ్స్ విధులు

ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పూర్తి స్థాయి శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సమానంగా హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసుల కంటే మెరుగ్గా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.సాంకేతిక విధులు, సీసీటీఎన్ఎస్, రైటర్స్ విధుల్లో హోంగార్డ్స్ ముందుండి సేవలందిస్తున్నారని తెలిపారు. వరదలు, విపత్తులు వంటి సంకట సమయాల్లో ప్రజల ప్రాణ, ధన రక్షణకోసం అహర్నిశలు కష్టపడుతున్నారని అభినందించారు.

హోంగార్డుల సంక్షేమమే ధ్యేయం

హోంగార్డు సిబ్బంది సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు. విధుల సమయంలో ఎండ, వాన, చలి ప్రభావం లేకుండా రైన్ కోట్స్, ఉలెన్ జెర్కిన్స్, కంటి అద్దాలు వంటి సామగ్రి అందిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా, ఆరోగ్య వ్యయాలు, పిల్లల చదువుల కోసం దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికీ హోంగార్డు సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు.

ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

హోంగార్డు అధికారుల పిల్లలకు చదువుల్లో ప్రతిభ చూపిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు.

ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ప్రతిభకు :

మొదటి బహుమతి : ₹18,000

రెండో బహుమతి : ₹15,000

మూడో బహుమతి : ₹12,000

పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభకు :

మొదటి బహుమతి : ₹15,000

రెండో బహుమతి : ₹10,000

మూడో బహుమతి : ₹8,000

ఉత్తమ సేవలకుగాను ప్రశంసా పత్రాలు

విధులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి జిల్లా ఎస్పీ సత్కరించారు. అనంతరం హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు.

హాజరైన అధికారులు

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, హోంగార్డు ఇన్చార్జి ఆర్ఎస్ఐ అశోక్, ఆర్ఎస్ఐలు సురేష్, సాయిరాం, రాజశేఖర్, ఏఆర్ఎస్ఐ వెంకన్నతో పాటు హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments