ఏపి డైనమిక్ డెస్క్,భీమవరం, అక్టోబర్ 22
రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీమవరం డీఎస్పీ జయసూర్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. జయసూర్య ఒక మంచి అధికారి అని ఆయన పేర్కొన్నారు. డీఎస్పీ జయసూర్య గురించి పవన్ కళ్యాణ్‌కు ఎవరేం చెప్పారో తనకు తెలియదని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం చాలా కాలంగా సహజమైందని, అయితే 13 ముక్కలాట నేరం కాదని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పేకాటలపై ఉక్కుపాదం మోపడంతో ఇటీవల కాలంలో భీమవరం పరిసర ప్రాంతాల్లో జూదాలు, పేకాట కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయని ఆయన తెలిపారు.ప్రజల శ్రేయస్సు కోసం పోలీసులు చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
