Monday, March 2, 2026
Homeఅంతర్జాతీయందుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదుబాయ్ పర్యటనలో వరుస సమావేశాలతో బిజీగా...

దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదుబాయ్ పర్యటనలో వరుస సమావేశాలతో బిజీగా సీఎం

డైనమిక్ డెస్క్,ఏపి, అక్టోబర్ 23

యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం దుబాయ్‌లోని ప్రసిద్ధ ఫ్యూచర్ మ్యూజియం‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.ఫ్యూచర్ మ్యూజియాన్ని “లివింగ్ మ్యూజియం”గా అభివృద్ధి చేసినట్లు అక్కడి అధికారులు సీఎంకు వివరించారు. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను చంద్రబాబు పరిశీలించారు. ‘ఫ్యూచర్ జర్నీ’ పేరిట ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ను కూడా సీఎం సందర్శించారు.రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన కొనసాగిస్తున్నారు. దుబాయ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments