Monday, March 2, 2026
Homeతాజా సమాచారంమున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి— జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి— జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 22

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమగ్ర వివరాలు అందజేశారు.

జిల్లాలో 475 పోలింగ్ కేంద్రాలు

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం 475 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజర్వేషన్ల అమలు పూర్తయ్యిందని, ఎన్నికల నిర్వహణ కోసం 70 మంది రిటర్నింగ్ అధికారులు (ROలు), 68 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (AROలు) నియమించామని వివరించారు.

నోడల్ టీములు – శిక్షణ పూర్తి

వివిధ విభాగాలకు సంబంధించి నోడల్ టీములు ఏర్పాటు చేసి, నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసినట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, కౌంటింగ్ సెంటర్లలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు.

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు

పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టర్ అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయ్యిందని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

భద్రతకు ప్రత్యేక చర్యలు

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. FST, SST టీములకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయని కలెక్టర్ వెల్లడించారు.

ఎన్నికల కమిషనర్ సూచనలు

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వివరాల అప్లోడింగ్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, వివిధ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.

అధికారులు హాజరు

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments