Monday, March 2, 2026
Homeఅమరావతితుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం హై అలర్ట్ అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులు – సీఎం చంద్రబాబు...

తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం హై అలర్ట్ అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులు – సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

డైనమిక్,అమరావతి, అక్టోబర్ 26

రాష్ట్రాన్ని ప్రభావితం చేసే తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులతో సమీక్షించారు.తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే తీర ప్రాంత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అదనంగా, తుఫాన్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోనల్ ఇంఛార్జీలను కూడా నియమించింది. తుఫాన్ తీవ్రత మరింత పెరిగితే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, నేడు రాత్రి కాకినాడ సమీప తీరాన్ని తుఫాన్ దాటే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తీరప్రాంత జిల్లాల్లో అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments