18 నెలల జ్వాయన్ కు ఎస్ఎంఏ సమస్య…
మంగళగిరి సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ 4 లక్ష రూపాయలు అందజేత…
ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి…
డైనమిక్,మంగళగిరి,
మంగళగిరి పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో నాలుగు లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మూడున్నర లక్షల రూపాయలు వసూలు చేయగా, స్కూల్ యాజమాన్యం 50 వేల రూపాయలు కలిపి నాలుగు లక్షల రూపాయల చెక్కును షేక్ యాసిన్ కు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కెవి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయురాలు దసరా సెలవులు సందర్భంగా విరాళాలు వసూలు చేసి నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యాసిన్ మాట్లాడుతూపల్నాడు జిల్లా నరసరావుపేట పనసతోటకు చెందిన షేక్ యాసిన్ షేక్ సిరిల్ దంపతుల కుమారుడు సుహమ్మద్ జ్వాయన్ ఎస్ఎంఏ (స్పైనల్ మసిలేటర్ ఆట్రోఫీ) సమస్యతో బాధపడుతున్నాడు. పదివేల మందిలో ఒక్క దికి వచ్చే ఎస్ఎంఏ వ్యాధితో ఆరు నెలల చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్న షేక్ యాసిన్ కుమారున్ని తొలుత బిందు న్యూరో కేర్ లో చూపించాడు. ఇది సాధారణ సమస్య కాదని గుర్తించిన వైద్యులు జెనిటిక్ పరీక్షకు పంపించగా అందులో పాజిటివ్ వచ్చింది. సెకండ్ ఒపీనియన్ కోసం సికిం ద్రాబాద్ రెయిన్బో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ కూడా పాజిటివ్ వచ్చిందని యాసిన్ తెలి పారు. ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్ అమెరికా నుంచి తెప్పించాలని దాని ఖరీదు రూ.16 కోట్లని వైద్యులు చెప్పారని యాసిన్ వాపోయారు. ప్రభుత్వం తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మానవ త్వంతో స్పందించి దాతలు 9177834384 చిన్నారి జ్యాయన్ షేక్ యాసిన్, స్పందించి తమ కుమారుడ్ని కాపాడాలని సిరిల్ దంపతులు నంబరుకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ షబానా ఫ్రాన్సిస్,వైస్ ప్రిన్సిపాల్ రజియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
