నేరేడుచర్ల, సెప్టెంబర్ 19 శుభోదయ డైనమిక్ వార్త
ఉప ఎన్నిక రాదని సీఎం రేవంత్‌రెడ్డి పగటి కలలు కన్నారని, ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైందని హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. నేరేడుచర్లలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు అరిబండి సురేష్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
22ఏ భూముల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే సర్వేలు
రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న 22ఏ భూముల సమస్యను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ భూములపై సర్వేలు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఒంటెద్దు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయాలన్నీ కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చుట్టూనే సాగుతున్నాయని విమర్శించారు.
కేటీఆర్ సవాల్‌ను సీఎం స్వీకరించాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి స్వీకరించాలని ఒంటెద్దు డిమాండ్ చేశారు. సీఎం, ఆయన తమ్ముడి భూములతో పాటు కేసీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి భూములపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్ చేశారని తెలిపారు. ఆ సవాల్‌ను స్వీకరించి విచారణకు ముందుకు రావాలని కోరారు.
దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామమని ఒంటెద్దు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలించిందని, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందని పేర్కొన్నారు. ఖాళీ అయిన స్థానంలో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని, గులాబీ జెండా ఎగురుతుందని అన్నారు.
శ్రీశైలం నీటి వాటాపై ఉత్తమ్‌పై విమర్శలు
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో నీటి అంశంపై వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఒంటెద్దు ఆరోపించారు. శ్రీశైలం నీటి వాటా విషయంలో 11 వేల క్యూసెక్కులు రావాల్సి ఉండగా 4 వేల క్యూసెక్కులకు మించి నీరు రావడం లేదని పేర్కొన్నారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు
ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్, 3వ వార్డు కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి, హుజూర్నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి యల్లబోయిన లింగయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోద రాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ జయబాబు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లంకెపల్లి నాగార్జున, బీఆర్ఎస్ నాయకులు పోకబత్తిని శేఖర్, చిట్యాల శ్రీను, కల్లూరు మాజీ సర్పంచ్ నాగరాజు, చంద్రగిరి తదితరులు పాల్గొన్నారు.
