నడిగూడం, శుభోదయ డైనమిక్ వార్త, జూలై 29
గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నల్గొండ పట్టణంలోని రాంనగర్లో ఉన్న ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఆధ్వర్యంలో 30 రోజుల హౌస్ వైరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ సంచాలకులు సియాజీ రాయ్ తెలిపారు. ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు పూర్తిగా ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలి
నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉపాధి అవకాశాలకు దోహదం
శిక్షణ పూర్తిచేసిన వారికి హౌస్ వైరింగ్ రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా నైపుణ్యాలను అందిస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 97010092652 నంబర్‌ను సంప్రదించాలని సంస్థ సంచాలకులు సియాజీ రాయ్ కోరారు.
