Thursday, March 26, 2026
Homeతాజా సమాచారంజీవితంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ అవసరంప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ అవసరంప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి

హుజూర్‌నగర్, మార్చి 26, డైనమిక్ న్యూస్

స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు.

బడ్జెట్, పొదుపు పై అవగాహన

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వేముల శ్రీనివాస్, మిరియాల అనుష మాట్లాడుతూ బడ్జెట్ అంటే ఏమిటి, క్రెడిట్–డెబిట్, సేవింగ్స్ ప్రాముఖ్యత వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు.

ముందుగా పొదుపు – తర్వాత ఖర్చు

మనకు ఉన్న ఆదాయంలో ముందుగా పొదుపు చేయడం, తర్వాత అవసరాలకు ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో జీవించవచ్చని తెలిపారు.

విద్యార్థి దశలోనే ఆర్థిక అవగాహన అవసరం

విద్యార్థి దశ నుంచే పొదుపు అలవాటు పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడతారని, మంచి ఆర్థిక నిపుణులుగా ఎదగవచ్చని పేర్కొన్నారు.

పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహమ్మద్ జానీ, వెంకటయ్య, కర్నే వెంకటేశ్వరరావు, కె.వి. సత్యనారాయణ, జయమ్మ, లావణ్య, ప్రియాంకతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments