డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 21
మోతె మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనం వద్ద గత గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ధ్వంసం చేశారు. ఉదయం స్థానికులు గమనించి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
ఈ ఘటనపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కట్టడి చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి కోరారు.
పలువురు నాయకుల పాల్గొనడం
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మూడు కృష్ణ, గుండారపు దుర్గయ్య, మండవ రాముడు, వీరబోయిన వెంకన్న, వీరబోయిన శ్రీను, కారింగుల కమలాకర్, కారింగుల వెంకన్న, కారింగుల కిరణ్, కారింగుల లింగయ్య, బత్తిని విజయలక్ష్మి, కారింగుల సరిత, వెంకటమ్మ, రేణుక, మౌనిక, సునీత, పాపమ్మ, ఝాన్సీ, పజ్జురి లక్ష్మమ్మ, గుండారపు అనసూయ తదితరులు పాల్గొన్నారు.

