చిలుకూరు, మార్చి 19 ,డైనమిక్ న్యూస్
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కళకళలాడాయి.
ఆంజనేయస్వామి ఆలయంలో హోమం
చిలుకూరులోని కాల్వ ఒడ్డు ఆంజనేయస్వామి ఆలయంలో కమిటీ సభ్యులు ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
రామాలయంలో పంచాంగ శ్రవణం
పాత చిలుకూరులోని కోదండ రామాలయంలో చైర్మన్ అచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని నూతన సంవత్సర ఫలితాలను శ్రద్ధగా వినిపించారు.
పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు
బేతవోలు, జెర్రిపోతులగూడెం, నారాయణపురం, కొండాపురం, రామాపురం గ్రామాలలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

