Thursday, March 19, 2026
Homeతాజా సమాచారంఉగాది సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

ఉగాది సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

హుజూర్ నగర్, డైనమిక్ న్యూస్, మార్చి 19

పరాభవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హుజూర్ నగర్ పట్టణంలోని పీర్లకొట్టం వెనుక బజారులో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని మామిడి తోరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు.

ప్రజాప్రతినిధులు, భక్తుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ చిట్టిపోతుల భద్రమ్మ, మాజీ కౌన్సిలర్ కారింగుల విజయ వెంకటేశ్వర్లు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో పాటు పలువురు భక్తులు, వార్డు పెద్దలు పాల్గొన్నారు.

దేవాలయానికి విరాళాల ప్రకటన

ఈ సందర్భంగా యువ న్యాయవాది రమేష్ మాట్లాడుతూ, దేవాలయ పూజారి కోసం వచ్చే 5 సంవత్సరాల పాటు ప్రతినెల రూ.2000 చెల్లిస్తానని ప్రకటించి, అదే రోజునుంచి అమలు చేస్తానన్నారు.
అలాగే ప్రముఖ వ్యాపారవేత్త తూముల శ్రీనివాస్ తన ధర్మపత్ని శ్రీదేవి దంపతులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని, వచ్చే ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు దీప, నైవేద్యాల ఖర్చులను భరించనున్నట్లు తెలిపారు.

ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో పొనుగుపాటి వాసుదేవరావు, రామిశెట్టి రాము, ఆకుల రాము, రామిశెట్టి ఉపేందర్, బత్తిని వీరప్రసాద్, పారేపల్లి నరసింహారావు, పోటు సాగర్, పోటు సతీష్, కుక్కడపు రామకృష్ణ, కుక్కడపు శ్రీకాంత్, అనంతు నరసింహారావు, రామిశెట్టి అంజయ్య, ఆవులపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments