Tuesday, June 2, 2026
Homeతాజా సమాచారంరంజాన్ సందర్భంగా పేదలకు సాయం ఓపెన్ ఐస్ సొసైటీ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

రంజాన్ సందర్భంగా పేదలకు సాయం ఓపెన్ ఐస్ సొసైటీ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మార్చి 18

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఓపెన్ ఐస్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు సరుకులు పంపిణీ చేశారు. శనివారం జరగనున్న రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకొని సీతారాం నగర్‌లోని మదీనా మసీదులో ఉర్దూ మదర్సాలో చదువుతున్న విద్యార్థులకు 25 కేజీల బియ్యం, రంజాన్‌కు అవసరమైన సరుకులు అందజేశారు.అలాగే మూడు పేద కుటుంబాలకు ఒక్కొక్కటికి 25 కేజీల చొప్పున బియ్యం మరియు ఇతర పండుగ సరుకులను పంపిణీ చేశారు. మొత్తం 100 కేజీల బియ్యం, సేమియా, ఖర్జూరం ప్యాకెట్లు, చక్కెర వంటి అవసరమైన వస్తువులను అందించినట్లు సొసైటీ ప్రతినిధి సులువ శ్రీను తెలిపారు.

సామాజిక బాధ్యతతో సేవలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ముస్లిం కుటుంబాలకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు షేక్ అబ్దుల్ మజీద్, కొడిమెల లక్ష్మణ్, పిల్లి శివశంకర్, దగ్గుబాటి రమేష్, శీలం అశోక్, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments