Monday, March 2, 2026
Homeతాజా సమాచారంతుమ్మగూడెంలో బీఆర్ఎస్‌కు భారీ షాక్కాంగ్రెస్‌లోకి 8వ వార్డు సభ్యుడు సమ్మయ్య అనుచరులతో చేరిక

తుమ్మగూడెంలో బీఆర్ఎస్‌కు భారీ షాక్కాంగ్రెస్‌లోకి 8వ వార్డు సభ్యుడు సమ్మయ్య అనుచరులతో చేరిక

డైనమిక్ న్యూస్, మోతే, ఫిబ్రవరి 26

మోతే మండలం తుమ్మగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రామపంచాయతీ 8వ వార్డు సభ్యుడు ఆవులదొడ్డి సమ్మయ్య తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే సమక్షంలో చేరిక

స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో సమ్మయ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పలువురు నాయకుల హాజరు

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడు రామాచారి, గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లు కరుణాకర్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాదగాని సత్యనారాయణ గౌడ్, దుంపటి శ్రీరాములు, ఉపసర్పంచ్ ఉబ్బపెల్లి వీరయ్య పాల్గొన్నారు.అలాగే 1వ వార్డు సభ్యుడు లింగయ్య, 2వ వార్డు సభ్యుడు దుంపటి ఉప్పయ్య, 3వ వార్డు సభ్యుడు మద్దికుంట్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, 9వ వార్డు సభ్యుడు చిలక ఎల్లమ్మ నాగేష్, 10వ వార్డు సభ్యుడు అనిత వెంకటేశ్వర్లు, తంతనపల్లి ఉమాశేఖర్ గౌడ్, మాదాసు వెంకన్న గౌడ్, ఇస్లావత్ నరేష్ నాయక్ తదితరులు హాజరయ్యారు.గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments