Monday, March 2, 2026
Homeతాజా సమాచారంనేరేడుచర్లలో రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఉత్తమ్ కుమార్ రెడ్డి బీటీ రోడ్ల...

నేరేడుచర్లలో రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఉత్తమ్ కుమార్ రెడ్డి బీటీ రోడ్ల ప్రారంభోత్సవానికి హాజరు

నేరేడుచర్ల, ఫిబ్రవరి 23, డైనమిక్ న్యూస్

నేరేడుచర్ల మండలం మరియు పట్టణంలో నిర్మించిన బీటీ రోడ్లను రేపు (ఫిబ్రవరి 24, మంగళవారం) రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం 12.00 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన బీటీ రోడ్ల పనులు పూర్తయ్యాయి. వీటి ప్రారంభోత్సవంతో మండలం, పట్టణ ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలగనుందని స్థానిక నాయకులు తెలిపారు.

అధిక సంఖ్యలో హాజరు కావాలి

కాంగ్రెస్ పార్టీ మండల , పట్టణ అధ్యక్షులు కోణతం చిన్న వెంకటరెడ్డి, నూకల సందీప్ రెడ్డి లు ప్రజలను, పార్టీ శ్రేణులను కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.మంత్రి పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments