పాలకవీడు, ఫిబ్రవరి 23 ,డైనమిక్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం పాలకవీడు మండలంలోని జానపహాడ్ శివారులో కృష్ణా నది వద్ద నిర్మాణంలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులను పరిశీలించనున్నారు.
రూ.650 కోట్ల వ్యయంతో నిర్మాణం
సుమారు రూ.650 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ పురోగతిని స్వయంగా పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం.
భారీగా హాజరుకావాలని పిలుపు
మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.వి. సుబ్బారావు పిలుపునిచ్చారు. మండలంలోని సర్పంచులు, మాజీ మరియు ప్రస్తుత ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.మంత్రి పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.
