Wednesday, April 8, 2026
Homeతాజా సమాచారంకాంగ్రెస్ సంక్షేమ పథకాలే తన విజయానికి పునాది3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పడిదల రవి ధీమా

కాంగ్రెస్ సంక్షేమ పథకాలే తన విజయానికి పునాది3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పడిదల రవి ధీమా

డైనమిక్ న్యూస్, జనవరి 31, సూర్యాపేట

సిఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తనను 3వ వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పడిదల రవి విశ్వాసం వ్యక్తం చేశారు.

నామినేషన్ దాఖలు చేసిన పడిదల రవి

శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పడిదల రవి నామినేషన్ దాఖలు చేశారు.

వార్డు సమగ్ర అభివృద్ధికి హామీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను గెలిపిస్తే ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ ల సహకారంతో 3వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా

వార్డులోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ సేవా దృక్పథంతో పనిచేస్తానని అన్నారు.

పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ధరావత్ రవి నాయక్, గండికోట లక్ష్మయ్య, బొల్లం సైదులు, గండికోట వెంకన్న, పడిదల నగేష్, వెంకన్న, మోర శ్రీను, సృజన్, లింగస్వామి, మహేష్, భిక్షం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments