Tuesday, April 21, 2026
Homeతాజా సమాచారంరాష్ట్ర గవర్నర్ పర్యటనను జయప్రదం చేయాలి మట్టపల్లి సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు పిలుపు

రాష్ట్ర గవర్నర్ పర్యటనను జయప్రదం చేయాలి మట్టపల్లి సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు పిలుపు

మఠంపల్లి, డైనమిక్ న్యూస్ , జనవరి 23

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి పర్యటనను విజయవంతం చేయాలని మట్టపల్లి గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు ప్రజలకు పిలుపునిచ్చారు.

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రధానంగా కృషి చేస్తున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమడుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు గవర్నర్ శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.

మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం

అలాగే, ఎంతో ప్రాచుర్యం పొందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గవర్నర్ దర్శించుకోనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.

ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి

ఈ చారిత్రక సందర్భంగా ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని గవర్నర్ పర్యటనను జయప్రదం చేయాలని సర్పంచ్ విజయశాంతి అప్పారావు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments